
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిల్లును ఆమోదించి దానికి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు దిల్లీలో డిసెంబరు 14న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జరుపుతున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్లో ‘చలో దిల్లీ’పై కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. మాదిగ విద్యార్థులకు భవిష్యత్తులో బంగరుబాట వేసేందుకే రాజీలేని పోరు సాగిస్తున్నామని ఆయన చెప్పారు. జాతీయ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి మాదిగ విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.