
తెలంగాణ
గోవా పర్యటనకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈనెల 4, శనివారంనాడు గోవాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేసింది. తెలంగాణ నుంచి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆ సమావేశానికి ఆహ్వానించింది. రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమల ప్రముఖులు, సాంకేతిక నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 2020-30 విద్యుత్తు వాహన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రాన్ని విద్యుత్తు వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్ హబ్‌గా మార్చేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. నిర్ధారిత సంఖ్యలో విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసిన వారికి రహదారి, రిజిస్ట్రేషన్ పన్నులను మినహాయించింది. విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసిన వారికోసం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఛార్జింగ్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమావేశంలో వివరించనున్నారు.