
తెలంగాణ
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఇస్తున్నట్లుగా ప్రతి రైతుకు, కుటుంబ సభ్యులకు పింఛన్లు ఇవ్వాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు డిమాండ్ చేశారు. పిల్లల చదువులు, వివాహాలు, గృహ నిర్మాణాలు, వైద్య ఖర్చుల నిమిత్తం బ్యాంకుల నుంచి సులభంగా రుణాలూ ఇప్పించాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. రైతుల ఖర్చుల్లో సగం ఉపాధి హామీ పథకం కింద భరించేలా చూడాలని కోరారు. పంటల బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించాలన్నారు.