
గ్రేటర్ హైదరాబాద్
ఎమ్మెల్సీ కవిత
ఈనాడు, కరీంనగర్: దేశంలో అవినీతికి తావులేకుండా పాలనను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జై శ్రీరాం అనే పార్టీలకు దీటుగా తెరాస నాయకులంతా జై హనుమాన్ అనాలని సూచించారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల నియోజకవర్గ స్థాయి తెరాస విస్తృతస్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం కొండగట్టు అంజన్న దేవాలయాన్ని దర్శించుకుని హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. మెట్పల్లిలో కవిత మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమాలతో గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఊళ్లల్లో జరిగిన అభివృద్ధిని చూపించాలన్నారు. దేవుడి పేరు చెప్పి భయపెట్టించే వారికి భయపడొద్దన్నారు. రాజకీయం మొత్తం దాని చుట్టూ తిప్పుతామని ఎదుటి పార్టీ వాళ్లంటే మనం అమాయకంగా ఉండొద్దని చెప్పారు. దేవుడి కన్నా భక్తుడే గొప్పని.. నాయకుడికన్నా ప్రజలే గొప్పని, అవసరమైతే దేవుణ్ని కూడా ప్రశ్నించే తత్వం తెలంగాణవారిదని ఆమె అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని
Telangana News: రేపటి నుంచి పది పరీక్షలు.. 5నిమిషాలు ఆలస్యమైతే అనుమతించరు!
British Airways: హైదరాబాద్- లండన్ విమానంలో తెలుగు సహాయక సిబ్బంది
Telangana News: పోలీస్ శాఖలో పోస్టులెన్నైనా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలు
జీఎమ్మార్ వెబ్సైట్లో రాజీవ్ పేరు తొలగింపు: దాసోజు శ్రవణ్
గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్టు ఆక్సిజన్ ప్లాంటు