
బిజినెస్
అక్టోబరు ఆఖరుకు రూ.1.02 లక్షల కోట్లకు
దిల్లీ: దేశీయ క్యాపిటల్ మార్కెట్లలోకి పార్టిసిపేటరీ నోట్ల (పీ-నోట్లు) ద్వారా వచ్చే పెట్టుబడులు ఈ ఏడాది అక్టోబరు ఆఖరుకు రూ.1.02 లక్షల కోట్లకు చేరాయి. గత 43 నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి. పీ-నోట్లను నమోదిత విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) విదేశీ మదుపర్లకు జారీ చేస్తారు. భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ మదుపర్లు పీ-నోట్ల ద్వారా పెట్టుబడులు పెడుతుంటారు. భారత ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి పీ-నోట్ల పెట్టుబడులు అక్టోబరు ఆఖరుకు రూ.1,02,553 కోట్లకు చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. 2018 మార్చి నెలాఖరులో పీ-నోట్ల పెట్టుబడులు రూ.1,06,403 కోట్లు ఇప్పటివరకు అధికం. గత నెలలోనే రూ.5,000 కోట్లకు పైగా నికర పెట్టుబడులు పీ-నోట్ల ద్వారా దేశీయ మార్కెట్లలోకి వచ్చాయి. విదేశీ మదుపర్లు రూ.7,000 కోట్లు ఈక్విటీల్లోకి చొప్పించగా, రూ.2,000 కోట్లు డెట్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.
మరిన్ని
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
Gold Bonds: 29 నుంచి మరో విడత గోల్డ్ బాండ్ స్కీమ్.. గ్రాము ధరెంతంటే?
5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!
Tega Industries IPO: డిసెంబరు 1న టెగా ఇండస్ట్రీస్ ఐపీఓ.. ధర ఎంతంటే?
Tata Group: సెమీకండెక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై మూడురాష్ట్రాలతో చర్చలు?