పంట నష్టాలపై కేంద్రానికి నివేదిస్తాం

కేంద్ర బృందం సభ్యులు

పి.గన్నవరం, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గత నెలలో వచ్చిన వరదలకు తీవ్రంగా నష్టపోయిన పంటలకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ రవినేష్‌కుమార్‌ తెలిపారు. గోదావరి వరదలతో నష్టపోయిన పంటలు, ఇళ్లను పరిశీలించేందుకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం సభ్యులు గురువారం పర్యటించారు. వారు రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు ప్రాంతాల్లో పర్యటించారు. గోపాలపురంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం పి.గన్నవరం మండలం నాగుల్లంక, గుడ్డాయిలంక, పల్లిపాలెంలో పర్యటించారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను తాము పరిశీలించామని రవినేష్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నష్ట అంచనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నివేదికను కేంద్రానికి అందిస్తామన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని