వాయుగుండం

ఈనాడు, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. ఆదివారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరానికి దగ్గర కానుంది. సోమవారానికి వాయుగుండంగానే కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ, యానాంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని సూచించారు. వాయుగుండం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో పలు చోట్ల ముసురు వాతావరణం నెలకొంది. శనివారం పలుచోట్ల వర్షాలు పడ్డాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని