రోడ్డు నిర్మించకపోతే ఇసుక తవ్వనివ్వం

టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ఇసుక టిప్పర్ల కారణంగా ధ్వంసమైన రహదారిపై  ప్రయాణించేందుకు మూడేళ్లుగా నరకయాతన పడుతున్నామని ఉప్పలపాడు గ్రామస్థులు ఆరోపించారు. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు ఇసుక రేవు ఎదుట గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఇప్పటికే రోడ్డు పూర్తిగా ధ్వంసమై భారీగా గోతులు పడ్డాయని, వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు నిలబడి రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు వాపోయారు. రోజుకి సుమారు 90 టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయని, 15 వేల టన్నులకు పైగా ఇసుక ఇక్కడి నుంచి తరలిస్తున్నారన్నారు. దీంతో తారురోడ్డు రూపు కోల్పోయిందని ఇసుక గుత్తేదారులతో వారు వాగ్వాదానికి దిగారు. పోలీసులు, సిబ్బంది అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. తారురోడ్డు నిర్మించిన తరువాతనే ఇసుక తరలించాలని, లేకపోతే ఇసుక తవ్వనివ్వమని గ్రామస్థులు తేల్చిచెప్పడంతో సుమారు 80 ఇసుక టిప్పర్లు వెనక్కివెళ్లాయి.
శునకం..


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు