
Electronics Mart IPO: ప్రారంభమైన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ.. పూర్తి వివరాలివిగో!
హైదరాబాద్: ‘బజాజ్ ఎలక్ట్రానిక్స్ (Bajaj Electronics)’ పేరిట ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల విక్రయశాలలను నిర్వహిస్తున్న ‘ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్’ ఐపీఓ (Electronics Mart IPO) మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 7వరకు ఇది కొనసాగనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు రూ.500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2021 సెప్టెంబరులో కంపెనీ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
ఐపీఓకి సంబంధించిన కీలక వివరాలు..
- ఐపీఓ ప్రారంభ తేదీ: అక్టోబరు 4
- ఐపీఓ ముగింపు తేదీ: అక్టోబరు 7
- ధరల శ్రేణి: రూ.56-59
- బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ తేదీ: అక్టోబరు 12
- రీఫండ్ల ప్రారంభం: అక్టోబరు 13
- డీమ్యాట్ ఖాతాలకు షేర్ల బదిలీ: అక్టోబరు 14
- లిస్టింగ్ తేదీ: అక్టోబరు 17
- కనీసం ఆర్డర్ చేయాల్సిన షేర్లు: 254 (ఒక లాట్)
- ఒక్కో షేరు ముఖ విలువ: రూ.10
వివిధ వర్గాలకు షేర్ల కేటాయింపు తీరు..
- అర్హతగల సంస్థాగత మదుపర్ల వాటా: 50%
- సంస్థాగతేతర మదుపర్ల వాటా: 15%
- చిన్న మదుపర్లు: 35%
ఇష్యూ ద్వారా వచ్చిన నిధుల్లో రూ.111.44 కోట్లు మూలధన వ్యయాలకు, రూ.220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఎలక్ట్రానిక్స్ మార్ట్ వినియోగించనుంది. రూ.55 కోట్ల రుణభారాన్ని తగ్గించుకోనుంది. ఆనంద్ రాఠి అడ్వైజర్స్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘బజాజ్ ఎలక్ట్రానిక్స్ (Bajaj Electronics)’ పేరిట 112 విక్రయశాలలను నిర్వహిస్తోంది. ‘కిచెన్ స్టోరీస్’ పేరిట మరో రెండు స్టోర్లు కూడా దీని యాజమాన్యంలో ఉన్నాయి. వీటిలో పూర్తిగా వంటగదికి సంబంధించిన వస్తువులను విక్రయిస్తుంటారు. మరోవైపు ఇంట్లో ఉపయోగించే ఆడియో పరికరాల కోసం ‘ఆడియో అండ్ బియాండ్’ పేరిట ఒక ప్రత్యేక స్టోర్‌ను కూడా నిర్వహిస్తోంది. 2021-22లో ఈ కంపెనీ ఆదాయం 36 శాతం పెరిగి రూ.434.93 కోట్లకు చేరింది.
మరిన్ని
Jio laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ
-
General News
Viveka Murder case: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐ విచారణకు సహకరిస్తా: అవినాష్‌రెడ్డి
-
India News
Mughal Gardens: మొఘల్ గార్డెన్స్.. ఇక ‘అమృత్ ఉద్యాన్’