Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. నేటి నుంచి ‘అగ్నిపథ్‌’ దరఖాస్తుల స్వీకరణ

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీలో చేరేందుకు శుక్రవారం నుంచి సెప్టెంబరు 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్‌ ఆర్మీ అధికారులు గురువారం ప్రకటించారు. www.joinindianarmy.nic.in  వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అక్టోబరు 1 నాటికి 23 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్‌, క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌ విభాగంలో పదోతరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నగరయాతన

నగరవాసం ప్రజలకు పరీక్ష పెట్టింది. నగర జీవికి గురువారం నరకం కనిపించింది. కొద్దిపాటి వర్షానికే సింహపురి మడుగును తలపించగా- ప్రధాన రహదారులతో పాటు రైల్వే అండర్‌ పాస్‌ల వద్ద భారీగా నీరు చేరి జనజీవనం స్తంభించింది. పేరుగొప్ప ప్రకటనలతో సరిపుచ్చుతున్న నాయకగణం మాటల్లోని డొల్లతనానికి.. యంత్రాంగం నిష్క్రియాపరత్వానికి మౌనసాక్షిగా నిలిచింది. వర్షపునీటి మడుగులకు తోడు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోయి.. వాహనదారులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులపై నగరానికి వచ్చేవారు.. బయటకు వెళ్లేవారు.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైౖద్యం డొల్ల.. జేబులు గుల్ల!

 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే చాలు అక్కడ వైద్యులు బాదుడే బాదుడు అన్న చందంగా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొంత మంది ఆర్థిక స్థోమతలేని బాధితులు బిల్లులు చెల్లించేందుకు పుస్తెలు సైతం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్కడ చూసినా.. కాలానుగుణ వ్యాధుల ప్రభావంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విశ్వమంతా లక్ష్మీమయం

శ్రావణమాసమంటే మనందరికీ బోల్డంత ఇష్టం. పూజలూ పెళ్లిళ్లతో కళకళలాడుతుంది. అందునా ఈరోజు రెండో శుక్రవారం. నిన్ననే అవసరమైన సరంజామా అంతా తెచ్చేసి, శనగలు నానబెట్టేసి ఉంటారు. సంతోషంగా, సంబరంగా వ్రతం చేసుకునే ముందు వరలక్ష్మీ దేవి విశిష్టతను తెలుసుకుందాం.. ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాలక్ష్మిని ఉదయం లేవగానే స్మరిస్తే ఇంట్లో, ఒంట్లో కూడా దారిద్య్రం ఉండదన్నారు ఆదిశంకరాచార్యులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమ్మా.. నాన్న.. ఓ దారి దోపిడీ

అమ్మానాన్నల సహకారంతో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి చేసిన దారి దోపిడీతో మొత్తం 13 మంది పోలీసుల చిట్టాలోకి ఎక్కారు. గతంలో దోపిడీలు  చేసిన అనుభవం.. మరో నేరానికి ప్రేరేపించింది. తల్లిదండ్రులు సహకరించడంతో భరత్‌ అనే ప్రధాన నిందితుడు మాయమాటలతో స్నేహితులను దారి దోపిడీకి పురికొ ల్పాడు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి చిత్తూరు పోలీసు అతిథిగృహంలో గురువారం వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వస్తాం.. ఉంటాం..!

ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో విద్యార్థులు కాని వారూ ఉండటం కలకలం రేపుతోంది. ఫలితంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకే ఈ పరిస్థితి ఎదురవుతోందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏయూ అధికారులు నాన్‌ బోర్డర్‌లను గుర్తించి బయటకు పంపించారు. స్కాలర్‌ల నిమిత్తం నిర్వహిస్తున్న బాలయోగి వసతి గృహంలో రైల్వేలో పని చేస్తున్న ఉద్యోగి, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉండడం గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విచారణ వివరాలన్నీ...రహస్యమే ..!

 

7. 30 కిలోమీటర్లు..ముచ్చెమటలు..

ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన గుడివాడ- విజయవాడ రహదారి పూర్తిగా పాడైంది. పలు చోట్ల కుంగిపోయి.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. చాలా ప్రదేశాల్లో రహదారి అంచులు కాల్వలో కలిసిపోయాయి. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఒకే మార్గం కావడంతో రెండు వైపులా పంట కాల్వలతో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పెను ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి. గత రెండేళ్లలో వందల సంఖ్యలో వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కణజాల ఇన్‌ఫెక్షన్‌ కలకలం

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వలలో సెల్యులైటిస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధితో గ్రామంలో మరికొంతమంది బాధ పడుతున్నారని, ఇందులో ఒకరు ఇటీవలే మృతి చెందారని గ్రామస్థులు చెబుతున్నారు. 2018లోనూ కల్వలతో పాటు పక్కనే ఉన్న అమీనాపురం, కోమటిపల్లి, వాటి శివారు తండాల్లో ఈ వ్యాధి సోకి పలువురు ఆసుపత్రి పాలవగా.. మళ్లీ ఇప్పుడు బాధితులు ఎక్కువవుతుండడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కోర్సు ఆపేస్తే సొమ్ము తిరిగి కట్టాల్సిందే!

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక సాయానికి ఉద్దేశించిన జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్థిక సాయాన్ని పొందిన విద్యార్థులు.. ఏదైనా కారణంతో కోర్సును మధ్యలో ఆపేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము మొత్తం తిరిగి కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. దీనికి కట్టుబడి ఉంటానని సదరు విద్యార్థి రూ.100 స్టాంపు పేపరు మీద రాసి ఇవ్వాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్రమత్తతతోనే పిడుగుపాటుకు దూరం

జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. మల్దకల్‌ మండలంలోని పావనంపల్లెలో ఓ రైతు, గద్వాల మండలంలోని బస్రచెర్వుకు చెందిన 9వ తరగతి విద్యార్థి పిడుగుపాటుతో ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ చెట్టు కింద ఉన్న సమయంలోనే పిడుగుపాటుకు గురయ్యారు. పావనంపల్లెలో జరిగిన ఘటనలో రైతుతోపాటు రెండు ఎద్దులు చనిపోయాయి. నెల రోజులుగా పాలమూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


మరిన్ని

ap-districts
ts-districts