పాలేరు వాగులో చిక్కుకున్న యువకుడు.. తాడు సాయంతో బయటకు లాగిన స్థానికులు

దంతాలపల్లి: మహబూబాబాద్‌ జిల్లాలోని పాలేరు వాగులో యువకుడు చిక్కుకుపోయాడు. జిల్లాలోని దంతాలపల్లి మండలం రామవరం శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిలో గుగులోత్‌ సురేష్‌ సురక్షితంగా బయటపడగా.. మరో యువకుడు యాకేష్‌ (18) వాగులో చిక్కుకుపోయాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. యాకేష్‌ను రక్షించేందుకు గ్రామస్థుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చివరకు తాడు సాయంతో యాకేశ్‌ను బయటకు లాగారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని