Crime News: నల్గొండలో దారుణం.. ప్రేమ పేరుతో వేధించి హత్యాయత్నం

నల్గొండ : నల్గొండలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఫారెస్ట్ పార్క్ లో మంగళవారం మధ్యాహ్నం డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రోహిత్  అనే యువకుడు నల్గొండలో బీబీఏ సెకండియర్ చదువుతున్నాడు. గత 7 నెలల నుంచి ఓ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈరోజు విద్యార్థిని తన ఫ్రెండ్ తో కలిసి ఫారెస్ట్ పార్క్‌ కు వెళ్లింది. రోహిత్ కూడా ఫారెస్టు పార్కుకు వచ్చి.. మాట్లాడాలంటూ యువతిని పక్కకు తీసుకెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పొట్ట, చేతులు, కాళ్లు, ముఖంపై దాడి చేసి పరారయ్యాడు. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న బాధితురాలి మిత్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఐ గోపి తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts