TS EAMCET: 12న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వెల్లడి?

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు ఈనెల 12న విడుదలయ్యే అవకాశముంది. ఎంసెట్‌ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్‌, 30, 31న అగ్రికల్చర్‌, ఫార్మా ఎంసెట్‌ నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్‌ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయాన్ని బట్టి ఈనెల 12 లేదా 13న ఫలితాలను ప్రకటించనున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts