Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!

కోల్‌కతా: పానీపూరీ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన పశ్చిమబెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో కలకలం రేపింది. అయితే, దీన్ని వైద్యులు డయేరియాగా అనుమానిస్తున్నారు. సుగంధ గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం డొగాచియాలోని ఓ స్ట్రీట్‌ స్టాల్‌ వద్ద  పానీపూరీ తిన్న వారిలో చాలా మందికి వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. సమాచారం అందుకున్న ప్రత్యేక వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించింది. రోగులకు మందులు పంపిణీ చేసింది. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వారిని ఆస్పత్రిలో చేరాలని సూచించారు. అస్వస్థతకు గురైన వారంతా డొగాచియా, బహిర్‌ రణగచ, మకల్తాలా గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని