Tirumala: సూర్యప్రభ వాహనంపై విహరించిన మలయప్పస్వామి

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవలో మలయప్పస్వామిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడి దర్శనంతో పూర్ణ ఫలం దక్కుతుందనేది భక్తుల నమ్మకం. ఈ వాహనసేవను తిలకిస్తే ఆరోగ్యం, ఐశ్వర్య భాగ్యం కలుగుతాయనేది వారి విశ్వాసం.



మరిన్ని