
Ponniyin Selvan: ఆలస్యం అవ్వడం కూడా మంచిదే..: మణిరత్నం
హైదరాబాద్: ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్1’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇక ఈ సినిమా గురించి మణిరత్నం ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ చిత్రాన్ని రూపొందించడానికి 1994, 2011లో రెండుసార్లు ప్రయత్నించాం. కానీ, కొన్ని కారణాల వల్ల ఆగిపోయాం. ఈ సినిమా తీయాలని నాతోపాటు చాలా మంది ప్రయత్నించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌సెల్వన్’ అనే నవల ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడుపోతోంది. ప్రజల హృదయానికి ఈ పుస్తకం అంతగా చేరువైంది. అలాగే నాకు కూడా ఈ నవల చాలా ఇష్టం. అందుకే సినిమా తీయాలనుకున్నా. చాలా కాలం వేచి చూశా. బహుశా అలా ఆలస్యం అవ్వడం కూడా మంచిదే అయింది. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. దాని వల్ల ఈ సినిమాను సాంకేతిక పరంగా ఎలాంటి రాజీ లేకుండా చేయగలిగాం. 5 భాగాలున్న ఆ పుస్తకాన్ని రెండు భాగాల సినిమా రూపంలో తీసుకొస్తున్నాం’’ అని చెప్పారు.
వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
భారీ అంచనాల మధ్య విడుదలైన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ వసూళ్లపరంగా పర్వాలేదనిపిస్తోంది. వీకెండ్ కలెక్షన్స్ విషయానికొస్తే అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ రూ.200 కోట్లు (గ్రాస్) వసూలు చేసిందని చిత్రబృందం వెల్లడించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష పలువురు ప్రముఖులు నటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు