
Oke Oka Jeevitham: శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఆ ఓటీటీలోకే.. కానీ
ఇంటర్నెట్ డెస్క్: శర్వానంద్ (Sharwanand) హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కి, మంచి విజయం అందుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). త్వరలోనే ఈ సినిమా ‘సోనీ లివ్’ (Sony Liv)ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘అమ్మ ప్రేమ కోసం ఆది చేసిన టైం ట్రావెల్ ప్రయాణం- ఒకే ఒక జీవితం. త్వరలో చూడండి’ అంటూ సదరు సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొంది. విడుదల తేదీ చెప్పకుండా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అమల అక్కినేని కీలక పాత్రధారిగా నటించిన ఈ సినిమా సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా శ్రీ కార్తిక్ మెప్పించారు.
కథేంటంటే: ఆది (శర్వానంద్), శ్రీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియదర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగిన వీళ్లు ఒకొక్కరూ ఒక్కో సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఎవరిలోనూ సంతృప్తి ఉండదు. ఈ ముగ్గురికీ పాల్ (నాజర్) అనే ఓ శాస్త్రవేత్త పరిచయం అవుతాడు. అతడు ఇరవయ్యేళ్లుగా టైమ్ మెషిన్ కనిపెట్టడం కోసం కష్టపడుతుంటాడు. చివరికి తాను కనిపెట్టిన టైమ్ మెషిన్‌తో గతంలోకి వెళ్లి తమ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఆది, శ్రీను, చైతూలకి ఇస్తాడు. మరి వాళ్లు గతంలోకి వెళ్లి ఏం చేశారు? తప్పుల్ని సరిదిద్దుకున్నారా ? భవిష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? విధి వారికి ఏం చెప్పిందనేది మిగతా కథ.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!