సంక్షిప్త వార్తలు (3)


గవర్నర్‌కు కాగ్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమలుపై ఆడిట్‌ నివేదికను కాగ్‌.. గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసింది. 2021, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంట్రోలర్‌, ఆడిటర్‌ జనరల్‌ నివేదికను అందచేసినట్లు పీఐబీ ఒక ప్రకటనలో పేర్కొంది.


కొత్తగా 1,061 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,061 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,23,724కు పెరిగింది. తాజాగా మరో 836 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,13,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 4న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,357 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 43,318 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,66,72,321కి పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో కొత్తగా 401 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 1,34,395 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేయగా.. ఇందులో 1,18,655 బూస్టర్‌ డోసులున్నాయి.


శ్రీశైలం నుంచి నీటి విడుదల

శ్రీశైలం ప్రాజెక్టు (మన్ననూర్‌), న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయం నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక గేట్‌ తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు జూరాల, సుంకేశుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి 1,98,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు 1,17,361 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు 5 యూనిట్ల ద్వారా 12.962 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేసి 26,011 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని