KCR: ఆదివాసీలకు అండగా ప్రభుత్వం: కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మమతానురాగాలకు, కల్మషం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9) సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజనులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మొహర్రం త్యాగానికి ప్రతీక

మొహర్రం మానవతావాదాన్ని ప్రతిబింబిస్తుందని, త్యాగం, శాంతి, న్యాయ ఆదర్శాలు అందరికీ స్ఫూర్తిదాయకమని గవర్నర్‌ తమిళిసై తన సందేశంలో తెలిపారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

పీవీ సింధుకు అభినందనలు

కామన్వెల్త్‌ క్రీడల్లో బాడ్మింటన్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన పీవీ సింధును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. పలువురు మంత్రులు సైతం సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన ఆచంట శరత్‌ కమల్‌, శ్రీజ ఆకులకు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు అభినందనలు తెలియజేశారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించిన లక్ష్యసేన్‌ను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ప్రత్యేకంగా అభినందించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని