ప్రభుత్వానికి ఫీల్డ్‌ అసిస్టెంట్ల కృతజ్ఞతలు

ఈనాడు, హైదరాబాద్‌: తమను విధుల్లో చేరేందుకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కవితను కలిసి ధన్యవాదాలు తెలిజేశారు. సీఎం తాజా నిర్ణయంతో 7,000 మందికి పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్సీ తెలిపారు. తెరాస కార్మిక విభాగం ఇన్‌ఛార్జి రూప్‌సింగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఎస్‌ ఫుడ్స్‌ ఛైర్మన్‌ మేడె రాజీవ్‌ సాగర్‌ పాల్గొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని