Corona Virus: కొవిడ్‌-19పై మెరుగ్గా పోరాడుతున్న చిన్నారుల నాసిక

మెల్‌బోర్న్‌: చిన్నారుల్లో ముక్కులో ఉండే ప్రత్యేక పొర పెద్దవారితో పోల్చితే కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 ఇన్‌ఫెక్షన్లను మెరుగ్గా నిరోధిస్తున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ కారణంగానే పెద్దవారితో పోల్చితే చిన్నారులు మునుపటి వేరియంట్లకు సంబంధించినంత వరకు వైరస్‌ బారిన పడడం తక్కువగా ఉండడం, లక్షణాలు సైతం స్వల్పంగా ఉండడం జరుగుతోందని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ (క్యూయూ) శాస్త్రవేత్తలు తెలిపారు. అదే సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో మాత్రం ఈ ధోరణి తక్కువగా ఉందని స్పష్టంచేశారు. ‘‘పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ రేటు తక్కువగా ఉండడం, కొద్దిపాటి తీవ్రత గల లక్షణాలే కనిపించేవి. ఇలా ఎందుకు జరుగుతోందనడానికి కారణం తెలియదు. పూర్వపు సార్స్‌-కోవ్‌-2 విషయంలో పెద్దలతో పోల్చితే చిన్నారుల ముక్కుల్లో ఉండే పొర మరింత ఇన్‌ఫ్లమేటరీ స్పందనను కలిగి ఉన్నట్లు తాజాగా మేం గుర్తించాం’’ అని యూక్యూకు చెందిన కిర్స్‌టీ షార్ట్‌ తెలిపారు. ఈ మేరకు పరిశోధకులు 23 మంది ఆరోగ్యవంతులైన చిన్నారులు, 15 మంది ఆరోగ్యవంతులైన పెద్దల నాసికా పొర కణాలను సేకరించి సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు ఎక్స్‌పోజ్‌ అయ్యేలా చేశారు. అనంతరం పరిశీలించగా.. చిన్నారుల నాసికా కణాల్లో వైరస్‌ తక్కువ సామర్థ్యంతో ప్రతిబింబించగా, వైరస్‌ నిరోధక స్పందనలు అధికంగా కనిపించాయి. ప్లాస్‌ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని