అగ్రరాజ్యంలో స్వాతంత్య్ర సంబరాలు

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వారు భారత స్వాతంత్య్ర సంబరాలు ఘనంగా నిర్వహించారు. మిన్నెసోట, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన వేడుకల్లో సినీనటుడు కమల్‌హాసన్‌, చెస్‌ క్రీడాకారిణి సంధ్యా గోలి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పురవీధుల్లో వంద అడుగుల జాతీయ పతాకాన్ని ఊరేగించారు. జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనం చేశారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అమెరికా ప్రాంతీయ ప్రతినిధులు పాల్గొని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలతో మిన్నెసోట రాజధాని భవనం వద్ద పండగ వాతావరణం కనిపించింది. 

- న్యూస్‌టుడే, అద్దంకి


మరిన్ని

ap-districts
ts-districts