close

తాజా వార్తలు

రేపు భాజపాలోకి ఆదినారాయణరెడ్డి?

కడప: మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తెదేపాను వీడనున్నారు. భాజపాలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన దిల్లీ బయల్దేరి వెళ్లారు. రేపు జాతీయ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆదినారాయణరెడ్డి తెదేపాకు అంటీముట్టనట్లే వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన భాజపాలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి చేరికకు భాజపా అధినాయకత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు