close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తమిళనాడులో 99.. కర్ణాటకలో 98 మంది మృతి

చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 5,879 పాజిటివ్‌ కేసులు, 99 మరణాలు వెలుగుచూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,51,738కి పెరిగింది. మరణాల సంఖ్య 4,034కి చేరింది. ఇప్పటి వరకు 1.90 లక్షల మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కర్ణాటకలోనూ కొత్తగా 5,172 కేసులు, 98 మరణాలు సంభవించాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,29,287కి చేరగా.. మరణాల సంఖ్య 2,412కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 73,219 ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేరళలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1129 కేసులు వచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇప్పటి వరకు 13,779 మంది కోలుకోగా.. 10,862 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దిల్లీ కొత్తగా 1,201 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. 26 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు చేరింది. ప్రస్తుతం 10,596 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 1.36 లక్షల మంది కోలుకున్నట్లు తెలిపింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు