close

తాజా వార్తలు

రాహుల్‌ పర్యటనపై ఆంక్షలెందుకు?: చిదంబరం

గవర్నర్‌పై చిదంబరం మండిపాటు

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం విరుచుకుపడ్డారు. రాహుల్‌ గాంధీపై సత్యపాల్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొడుతూ వరుస ట్వీట్లు చేశారు.  

‘రాహుల్‌ గాంధీకి జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ ఇచ్చిన ఆహ్వానంలో నిజాయతీ లేదు. ఇది ప్రచారం కోసం మాత్రమే. రాహుల్‌ గాంధీ మీద ఆంక్షలు విధించడం సరికాదు. ఆయనకు సైనికులతో సహా అందరినీ కలిసే స్వేచ్ఛ ఇవ్వాలి. అలా ఎలా ఆంక్షలు పెడతారు. ఒక పర్యాటకుడు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడటం, సైనికుల సంక్షేమం గురించి అడగడం వంటికి చేయకూడదా?’ అని ప్రశ్నించారు.

కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సోమవారం మండిపడ్డారు. రాహుల్‌ను తాను కశ్మీర్‌కు ఆహ్వానించానని, ఆయనకు విమానం కూడా పంపుతానని, వచ్చి ఇక్కడి పరిస్థితి గమనించి అప్పుడు మాట్లాడాలని ఆయన అన్నారు. ఆ పర్యటనపై కొన్ని ఆంక్షలు విధించారు. దీనిపై రాహుల్‌ కూడా ట్వీట్‌ చేశారు. పర్యటనకు విమానం పంపాల్సిన అవసరం లేదన్నారు. తనతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించి, ప్రజలు, సైనికులను కలిసి మాట్లాడేందుకు స్వేచ్ఛ కల్పించాలని రాహుల్‌ గవర్నర్‌ను కోరారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు