close

తెలంగాణ

చుక్క రక్తంతో ఎన్నో వ్యాధి నిర్ధారణ పరీక్షలు

చౌకైన సాధనాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ పరిశోధకులు

కోల్‌కతా: చుక్క రక్తంతో అనేక వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించే చౌకైన డయగ్నోస్టిక్‌ సాధనాన్ని ఖరగ్‌పుర్‌లోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందులో కాగితపు పట్టీ ఆధారంగా పనిచేసే ఒక కిట్‌ ఉంటుంది. విశ్లేషణలకు వీలు కల్పించడానికి, ఇమేజింగ్‌ అవసరాల కోసం ఎల్‌ఈడీ లైట్‌ వంటివి దీనికి అవసరం. అందుకు ఒక స్మార్ట్‌ ఫోన్‌తో ఈ కిట్‌ను అనుసంధానించాలి. దీన్ని వినియోగించడం చాలా తేలికని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ సుమన్‌ చక్రవర్తి పేర్కొన్నారు. ఒక్కో పరీక్షకు ఒక రూపాయి కన్నా తక్కువ వ్యయమవుతుందన్నారు. దీన్ని వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తెచ్చాక ఈ వ్యయంలో స్వల్ప మార్పు ఉండొచ్చని వివరించారు. సుశిక్షత సిబ్బంది అవసరం లేకుండానే దీన్ని వాడొచ్చన్నారు. పరిమిత స్థాయిలో వైద్య సౌకర్యాలు కలిగిన గ్రామాల్లోనూ దీన్ని విస్తృతంగా పరీక్షించామని తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు