close

క్రైమ్

తన హత్యకు తానే పథకం

జైపుర్‌: ఇది కథకాదు. కుటుంబసభ్యులకు బీమా సొమ్ము వస్తుందని ఓ వ్యక్తి తన హత్యకు పథకం వేసుకుని చనిపోయిన విషాద సంఘటన.  రాజస్థాన్‌లోరి భిల్వారాకు చెందిన బల్వీర్‌ ఏవో అవసరాల కోసం తలతాకట్టుపెట్టి రూ.20 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనపడలేదు. దాంతో తీవ్ర నిస్పృహకు లోనై రూ.50 లక్షలకు ప్రమాద బీమా చేయించుకున్నాడు. అందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు. తన కుటుంబం కష్టాలపాలుకాకూడదని, వారికి బీమా సొమ్ము వస్తుందని భావించాడు. సొమ్ము క్లెయిమ్‌ చేయటానికి తనను తానే హత్య చేయించుకోవటానికి అతడు ఉత్తరప్రదేశ్‌కు వాసి సునీల్‌ యాదవ్‌ను సంప్రదించాడు. అతడికి 80,000 చెల్లించాడు. సునీల్‌.. రజ్వీర్‌ అనే వ్యక్తిని సహాయకుడిగా నియమించుకున్నాడు. ఆ ఇద్దరు కలసి బల్వీర్‌ను గొంతు నులిమి హత్య చేశారు. పోలీసులు కేసు ఛేదించి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు