close

క్రైమ్

నీట మునిగి ఆరుగురు చిన్నారుల మృతి

వినాయకుడి నిమజ్జనంలో విషాదం

కోలారు, న్యూస్‌టుడే: వినాయకుడి నిమజ్జనంలో తీరని విషాదం చోటుచేసుకుంది. గణేశుడి చెంత అప్పటి వరకూ ఆడిపాడిన ఆరుగురు చిన్నారులు నీటిపాలయ్యారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్‌ తాలూకా మరదఘట్టలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పిల్లలంతా మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసి ఘనంగా పండగను నిర్వహించారు. మంగళవారం నిమజ్జనం సమయంలో కుంటలో ఒకరి తరవాత ఒకరుగా బాలలు నీటిలోకి జారి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన చిన్నారులను రక్షిత, తేజ, వైష్ణవి, వీణ, రోహిత్‌, ధనుష్‌గా గుర్తించారు. వీరంతా పన్నెండేళ్లలోపు బాలలే. ఈ దుర్ఘటన నుంచి ఇద్దరు చిన్నారులు బయటపడ్డారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు