close

బిజినెస్‌

మార్కెట్‌ కబుర్లు

* ఆంధ్రప్రదేశ్‌ సహా 8 రాష్ట్రాల్లో 950 కిలోమీటర్ల జాతీయ రహదారులను రూ.30,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించాల్సి ఉందని జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ తెలిపింది. 4-6 లేన్ల రహదారులుగా వీటిని అభివృద్ధి చేస్తారు.
* ఎయిరిండియా విక్రయానికి సంబంధించి విధి విధానాలను రూపొందించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో మంత్రుల బృందం (జీఓఎం) గురువారం సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడే ప్రకటించలేమని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు.
* వినియోగదారు బ్రాండ్ల అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినట్లు విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ సంస్థ తెలిపింది.
* మధ్యప్రదేశ్‌లోని తమ మండిదీప్‌ ప్లాంటుకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి హెచ్చరిక లేఖ అందినట్లు లుపిన్‌ వెల్లడించింది.
* ఆర్‌బీఐ సూచించిన విధంగా రెపో రేటు ఆధారిత రిటైల్‌, ఎంఎస్‌ఈ రుణాలను అక్టోబరు 1 నుంచి అందించబోతున్నట్లు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలిపింది.
* భారత్‌-22 ఈటీఎఫ్‌ నాలుగో విడత ఇష్యూ వచ్చే నెలలో ఉండే అవకాశం ఉంది. ఈ ఈటీఎఫ్‌ను నిర్వహించే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌  సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
* సామాజిక సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల నమోదు, నిధుల సమీకరణకు వీలు కల్పించే సామాజిక స్టాక్‌ ఎక్స్ఛేంజీల ఏర్పాటుకు ఉన్న మార్గాలు, నిబంధనల రూపకల్పనపై సలహాలు ఇచ్చేందుకు ఓ అత్యున్నత స్థాయి కమిటీని సెబీ గురువారం ఏర్పాటు చేసింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు