close

క్రైమ్

భర్త మర్మాంగాన్ని కోసిన భార్య, బావమరిది

గడివేముల, నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: భర్తపై భార్య దాడిచేసి మర్మాంగాన్ని కోసిన దారుణ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురంలో చోటు చేసుకుంది. బాధితుడు షేక్‌ యూనుస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పాణ్యం మండలం ఎస్‌.కొట్టాలకు చెందిన యూనుస్‌కు సోమాపురం గ్రామానికి చెందిన షేక్‌ హసీనాకు రెండేళ్ల క్రితం వివాహమైంది. బంగారం విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. 6 నెలల క్రితం ఆమె పుట్టింటికి వచ్చింది. పోలీసులు వారికి ఈనెల 18న కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో యూనుస్‌ బుధవారం భార్య కోసం సోమాపురానికి వెళ్లారు. రాత్రి భార్య హసీనా, బావమరిది వహబ్‌ కత్తెరతో యూనుస్‌పై కత్తెరతో దాడిచేశారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు