close

క్రైమ్

చింతమనేని మళ్లీ అరెస్టు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈనెల 11న అరెస్టయి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా జైలులో ఉన్న దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను మరో కేసులో మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చి సెకండ్‌ ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అక్టోబరు ఒకటి వరకు రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ని మళ్లీ జిల్లా జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 11న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు దుగ్గిరాలలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో మహిళా పోలీసులు ఐదుగురు చింతమనేని కోసం ఆయన ఇంట్లోకి ప్రవేశించగా అక్కడ కొందరు వారిని దుర్భాషలాడి గేటుకు తాళం వేశారు. ఈ కేసులో చింతమనేని నిందితుడిగా ఉండటంతో కోర్టు అనుమతితో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు