close

క్రైమ్

మూకదాడిలో యాచకుడి మృతి

ఝార్ఖండ్‌: రాష్ట్రంలో మూకదాడులు ఆగలేదు. తాజాగా సాహిబ్‌గంజ్‌ జిల్లా, మిర్జాచౌకీ ఠాణా పరిధిలోని కుచిపహాడ్‌లో జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నాడనే అనుమానంతో బుధవారం ఓ వృద్ధుడిని స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్థులు. తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే మృతిచెందాడు. తీరా అతను ఎవరన్నది ఆరా తీయగా... యాచకుడని, రోజూ గ్రామాల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తుంటాడని తెలిసింది. పోలీసులు  పెద్దసంఖ్యలో గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి అతని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్‌పీ జనార్దనన్‌ చెప్పారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు