close

బిజినెస్‌

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని విక్రయించనున్న జీఎంఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఒడిశాలో ఉన్న తన థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును విక్రయించేందుకు జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీతో చర్చిస్తోంది. సోమవారం ఈ రెండు సంస్థలూ చర్చలకు సంబంధించిన విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చాయి. జీఎంఆర్‌ ఎనర్జీకి అనుబంధంగా కొనసాగుతున్న జీఎంఆర్‌ కమలనాగ ఎనర్జీ లిమిటెడ్‌ నిర్వహిస్తోన్న 1050 మెగావాట్‌ థర్మల్‌ పవర్‌ కేంద్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్చలు జరిగాయని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. అదే సమయంలో జీఎంఆర్‌ తన అనుబంధ సంస్థలో పెట్టుబడిని ఉపసంహరించుకునేందుకు వీలుగా జేఎస్‌డబ్యూ ఎనర్జీతో మాట్లాడినట్లు బీఎస్‌ఈకి సమాచారమిచ్చింది.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో నూతన పార్కింగ్‌ విధానం: జీఎంఆర్‌ నిర్వహిస్తోన్న హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాహనాల రాకపోకలకు సంబంధించి నూతన పార్కింగ్‌ విధానాన్ని ప్రారంభించింది. వాహనాలు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు.. ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రుసుము చెల్లించి, రశీదు తీసుకోవాలి. ఆ తర్వాత బయటకు వెళ్లేప్పుడు స్కానర్‌ ఎదుట ఆ రశీదును చూపిస్తే సరిపోతుంది. ఇది 24 గంటలపాటూ అందుబాటులో ఉంటుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు