close

క్రైమ్

ఎదురు కాల్పుల్లో జవాను మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని జరిపల్లి అటవీ ప్రాంతంలో ఘటన

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి అలజడి రేపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు 18 కి.మీ దూరంలోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా జరిపల్లి అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ 151 బెటాలియన్‌ జవాను కంటా ప్రసాద్‌ మృతి చెందాడు. పామేడులోని ఎస్టీఎఫ్‌ శిబిరంపై బుధవారం రాత్రి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్‌ పోలీసులు, మావోయిస్టుల మధ్య పావుగంట పాటు కాల్పులు జరిగాయి. గురువారం ఉదయం సీఆర్పీఎఫ్‌ 151 బెటాలియన్‌ పోలీసులు, ఎస్టీఎఫ్‌ బలగాలు సమీప అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జరిపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. జవాను ప్రసాద్‌ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనను బీజాపూర్‌ ఎస్పీ గోవర్ధన్‌ ఠాకూర్‌ ధ్రువీకరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు