close

జాతీయ- అంతర్జాతీయ

చైనా ఆట‘విరుపు’

ఆన్‌లైన్‌ గేమ్స్‌పై ఆంక్షలు

బీజింగ్‌: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు చిన్నారులు బానిసలు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న చైనా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ తరహా ఆటలపై వారు గడిపే సమయాన్ని కట్టడి చేయడానికి ‘కర్ఫ్యూ’ విధించింది. చైనా ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం 18 ఏళ్ల లోపు చిన్నారులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటానికి వీల్లేదు. పగటి సమయంలో కూడా ఏకబిగిన 90 నిమిషాలకు మించి ఆడకూడదు. ఆన్‌లైన్‌ గేమ్స్‌పై మైనర్లు వెచ్చించాల్సిన సొమ్ము నెలకు 28 డాలర్లకు మించడానికి వీల్లేదు. 16-18 ఏళ్ల వయసువారికి ఈ మొత్తాన్ని నెలకు 56 డాలర్లకు పరిమితం చేసింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారంతా వాస్తవ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఫోన్‌ నెంబర్‌ లేదా ఐడీ నెంబర్‌తో సైనప్‌ కావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఆటలకు చిన్నారులు బానిసలు కాకుండా చూడటానికి ఆటలోని నిబంధనలను మార్చాలని గేమ్‌ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్‌ మార్కెట్‌గా చైనా ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు