close

జాతీయ- అంతర్జాతీయ

పారిశ్రామికవేత్తలు కోరేది రాయితీలు కాదు పారదర్శకతే

ప్రధాని మోదీ స్పష్టీకరణ

ధర్మశాల: పారదర్శకతతో కూడిన సులభతరమైన వాణిజ్య వాతావరణం, సరళమైన నిబంధనలు ఉండాలని మాత్రమే పారిశ్రామికవేత్తలు కోరుకుంటారని ఉచిత విద్యుత్తు, తక్కువ ధరకు భూములు, పన్ను రాయితీలు కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన సదస్సును ఆయన గురువారం ప్రారంభించి ప్రసంగించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సులభతర వాణిజ్య వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు పోటీ పడాలి తప్ప ఉచితాలు, రాయితీలు ఇవ్వడంలో కాదన్నారు. రాయితీలు ఇవ్వడంలో పోటీ పడటం వల్ల తమ రాష్ట్రానికీ, పరిశ్రమలకూ ఎలాంటి ఉపయోగం ఉండదని రాష్ట్రాలు కూడా గుర్తిస్తున్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రభుత్వ జోక్యం తగ్గి ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌ కూడా పోవాలని తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అనుసరిస్తున్న ఏకగవాక్ష విధానాన్ని, పారదర్శకంగా భూముల కేటాయింపును ప్రధాని అభినందించారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ పటేల్‌, అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు.
 ప్రధాన మంత్రి మోదీ ఈ నెల 13,14 తేదీల్లో బ్రెజిల్‌లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బ్రిక్స్‌ సదస్సులో పాల్గొంటారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు