close

సినిమా

21 రోజులు మంచి అవకాశం

డాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు కథానాయికలు. పక్కాగా ప్రణాళికలు వేసుకుని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆ విషయంలో  తమన్నా మరింతగా ఆరితేరిపోయారు. అందుకే పలు భాషల్లో ఆమె సినిమాలు చేస్తుంటుంది. కరోనా కారణంగా దొరికిన ఖాళీని కూడా పక్కాగా వాడుకుంటానని చెబుతోంది తమన్నా. ‘‘ఇది కూడా ఓ మంచి అవకాశంగా భావిస్తా. ఇన్నాళ్లు చేయాలనుకుని చేయలేకపోయిన పనులపై దృష్టి పెట్టే సమయం వచ్చింది. అందుకే ఈ 21 రోజుల వ్యవధిని నేను నా జీవన శైలిని మరింత ఆరోగ్యకరంగా, మరింత స్థిరంగా మార్చుకోవడానికి వాడుకోవాలని నిర్ణయించుకున్నా. ఏదైనా ఒకటి మనకు అలవాటు కావాలన్నా, దాన్నుంచి మనం దూరం కావాలనుకున్నా 21 రోజులు అవసరమట. ఒక మంచి అలవాటు చేసుకోవడానికి ఈ సమయాన్నే మనం ఎందుకు వాడుకోకూడదు?’’ అంటోంది తమన్నా.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు