close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శిబిరం తరలింది

జైసల్‌మేర్‌కు గహ్లోత్‌ వర్గ ఎమ్మెల్యేలు
జైపుర్‌ నుంచి విమానాల్లో తరలింపు

జైసల్‌మేర్‌/జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు 14 రోజుల సమయం ఉండటంతో ప్రత్యర్థుల ప్రలోభాల నుంచి తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వారిని జైపుర్‌ నుంచి 550 కి.మీ దూరంలో ఉన్న జైసల్‌మేర్‌కు తరలించారు. గహ్లోత్‌తో పాటు ఆయన వర్గ శాసనసభ్యులందరూ ఐదు విమానాల్లో అక్కడకు చేరుకున్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసమే శాసనసభ్యులను శిబిరానికి తరలించినట్లు సమర్థించుకున్నారు.

సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌..
సచిన్‌ పైలట్‌ వర్గ ఎమ్మెల్యేలకిచ్చిన అనర్హత నోటీసులపై రాజస్థాన్‌ హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయటాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ మహేశ్‌ జోషి శుక్రవారం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. గహ్లోత్‌ వర్గ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించారంటూ ఆడియో టేపుల కేసులో అరెస్టు చేసిన సంజయ్‌ జైన్‌ను రాజస్థాన్‌ పోలీసులు శుక్రవారం జైపుర్‌లోని స్థానిక కోర్టులో హాజరు పరిచారు. దిగువ కోర్టులో స్వర నమూనాలను ఇచ్చేందుకు సంజయ్‌ జైన్‌ తిరస్కరించటంతో తదుపరి చర్యల విషయంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇదిలా ఉండగా ఓ అవినీతి కేసులో నిందితులుగా ఉన్న సచిన్‌ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ఏసీబీ పోలీసులకు అనుమతి లభించలేదు.


భాజపా విమర్శలపై గహ్లోత్‌ ట్వీట్‌

‘‘రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరటాన్ని ప్రశ్నిస్తున్న భాజపా నేతలు... గత ఏడాది తెలుగు దేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో ఎలా విలీనం చేసుకున్నారు? భాజపా నేతల రాజకీయ క్రీడలను దేశమంతా చూస్తోంది’’ అని గహ్లోత్‌ ట్వీట్‌ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు