close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చిటికెలో చక్కని పరిష్కారం...

చర్మం కొన్నిసార్లు నిర్జీవంగా, నల్లగా మారుతుంది. తేమను కోల్పోయినట్లు కనిపిస్తుంది. ఈ సమస్యలకు ఇంట్లో దొరికే పదార్థాలతోనే పరిష్కారం సాధ్యం.

చిటికెలో చక్కని పరిష్కారం...

పెరుగు: చర్మం పొడిబారి మరీ ఇబ్బంది పెడుతోంటే పెరుగు, తేనె, అరటిపండు గుజ్జు సమపాళ్లలో తీసుకుని ముఖం, మెడ వంటి చోట్ల మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్‌ సి, జింక్‌, క్యాల్షియం... వంటివి చర్మ సమస్యల్ని దూరం చేసి తేమనందిస్తాయి. అరటిపండులో ఉండే లెక్టిన్‌ అనే ప్రొటీన్‌ యాక్నె కారకాల్ని దూరం చేస్తాయి.

కలబంద: ఇది అన్ని చర్మతత్వాల వారికీ పనిచేస్తుంది. కలబందగుజ్జులో కాస్త... కొద్దిగా గంధం పొడి, కాస్త పెరుగు కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేస్తే నలుపు, యాక్నె, దురద, దద్దుర్లు తగ్గుతాయి. తేమ అందుతుంది. కాలిన గాయాలకు రాస్తే సాంత్వన కలుగుతుంది.

కొబ్బరినూనె: ఆలివ్‌ లేదంటే కొబ్బరి నూనెను తలకు రాసుకోవాలి. ముప్పావు గంటయ్యాక అరకప్పు బ్లాక్‌ టీతో మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక వెనిగర్‌లో కాస్త ఆలివ్‌నూనె, గుడ్డులోని తెల్లసొన కలిపి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలడం అరికట్టొచ్చు. మెరిసిపోతుంది.


మరిన్ని