close

తాజా వార్తలు

వీడియో గేమ్ అనుకొని ముందుకెళ్లాడు

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో మసీదుల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ఆ దేశ వ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. అయితే ఆ కాల్పుల్లో దాదాపు 50 మంది మరణించగా, వారిలో అత్యంత చిన్నవాడైన వ్యక్తి వయసు మూడు సంవత్సరాలు. కుటుంబంతో సహా శుక్రవారం ఆల్‌నూర్ మసీదులో ప్రార్థనలకు వచ్చిన ఆ చిన్నారి  ఆ దారుణ ఘటనలో బలయ్యాడు. 

ఆ చిన్నారి పేరు ముకాద్ ఇబ్రహీం. అతడి తల్లిదండ్రులు 20 సంవత్సరాల క్రితమే సోమాలియా నుంచి వలస వచ్చి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ‘ముకాద్ చాలా హుషారుగా, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. మిస్ యూ డియర్లీ బ్రదర్‌’ అని అతడి సోదరుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అయితే చిన్నారి ముకాద్ మసీదుల్లో జరుగిన మారణహోమాన్ని ఓ వీడియో గేమ్‌లా భావించాడట. ఆ దుండగుడు ప్రార్థనలు చేసేవారి మీద ఇష్టారీతిగా కాల్పులు జరుపుతుంటే, ముకాద్ దాన్ని తాము ఆడుకొనే వీడియో గేమ్‌లో ఓ సన్నివేశమనుకుని, కాల్పులు జరిపే వ్యక్తి వైపు పరిగెత్తాడని సోదరుడు హసన్ వెల్లడించాడు. ఆ సమయంలో ముకాద్  కుటుంబ సభ్యులు తలోవైపుకు పరుగులు తీశారు. ఆ బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వం ఆదివారం రాత్రి అతడి కుటుంబానికి అప్పగించింది.  


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు