close

తాజా వార్తలు

ఖమ్మం బరిలో ఎవరు?

ఇంకా ప్రకటించని తెరాస, కాంగ్రెస్‌.. నేడు స్పష్టత 

ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్‌ ఈ స్థానం నుంచి అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదు. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ఖమ్మం టికెట్‌ ఆశిస్తుండగా.. తెరాస నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రాజేంద్రప్రసాద్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.

తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకు గానూ 16 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం అభ్యర్థి ఎంపికను మాత్రం పెండింగ్‌లో ఉంచింది. మరోవైపు తెరాస ఇంత వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించనప్పటికీ ఆరుగురి పేర్లను ఖరారు చేసింది. ఇందులో ఖమ్మం అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఇరు పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరు? అనేది ఇంకా స్పష్టత రాలేదు. నామినేషన్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు