close

తాజా వార్తలు

ఈసారి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా దిగుతా: రోహిత్‌

యూవీ అనుభవం మాకెంతో ఉపయోగం

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా దిగుతానని చెప్పాడు. మంగళవారం టీమ్‌ మెంటార్‌ జహీర్‌ఖాన్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ.. తాను ఈ సీజన్‌ మొత్తం ఓపెనింగ్‌ బ్యాట్సమెన్‌గా దిగుతానని అన్నాడు. గతేడాది ఏ స్థానంలోనూ కుదురుకోకపోవడంతో ఈసారి ఓపెనింగ్‌ చేస్తానని ప్రకటించాడు. 
ఇదిలా ఉండగా ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం ఈ ఏడాది యువరాజ్‌సింగ్‌ను జట్టులోకి తీసుకున్న నేపథ్యంలో మిడిల్‌ఆర్డర్‌ మరింత బలంగా మారిందని రోహిత్‌ చెప్పాడు. గత మూడు నాలుగు ఐపీఎల్‌ సీజన్లలో సరిగ్గా ఆడని యూవీ ఈసారి తమ జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని విశ్వాసం వ్యక్తంచేశాడు. ముంబయి ఇండియన్స్‌కు యూవీ అదనపు బలంగా మారుతాడని.. తప్పకుండా మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడని చెప్పాడు. అనంతరం జహీర్‌ మాట్లాడుతూ.. ఒక్కోసారి ఆటగాళ్లు మొదటి వేలంలో అమ్ముడుపోరని, తర్వాత వారి అనుభవం రీత్యా రెండో వేలంలో అమ్ముడుపోతారని చెప్పాడు. అలాగే తమకు యూవీ దొరికాడని పేర్కొన్నాడు. యూవీ రాకతో తమ మిడిల్‌ఆర్డర్‌ బలంగా మారిందన్నాడు.
ఇదిలా ఉండగా గతేడాది ప్లే ఆఫ్‌ దశలోనే ముంబయి ఇండియన్స్‌ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రోహిత్‌.. ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు తమ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. ఇప్పటికే తాను ఆటగాళ్లతో మాట్లాడడని.. వారంతా ఈసారి మంచి ప్రదర్శన చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు