close

తాజా వార్తలు

ఎన్నికల సమాచారం అడగమంటే..

హిసార్‌(హరియాణా) : కేంద్ర ఎన్నికల సంఘం సదుద్దేశంతో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబరు(1950) హరియాణా ఎన్నికల సంఘ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి తలనొప్పి తెప్పిస్తోంది. దానికి కారణం ప్రజల నుంచి ఆ నంబరుకు వస్తోన్న ప్రశ్నలే. ఎన్నికలకు సంబంధించిన సందేహాలను తీర్చడం కోసం ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఆధార్‌ కార్డు, రేషన్ కార్డు, తోటపని, కరెంటు కోత.. ఇలా పలు అంశాలపై ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు ప్రజలు. దాంతో అక్కడి సిబ్బందికి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కానీ పరిస్థితి ఎదురవుతోంది.

‘కిన్నౌ మొక్కను ఎలా నాటాలి మేడమ్. ఆ మొక్కలు ఎక్కడ దొరుకుతాయ్‌’, ‘మా గ్రామాల్లో కరెంటు కోత సమస్య ఉంది. ఈ ప్రభుత్వం ఆ సమస్యను తీర్చలేకపోతే, మేము మరో పార్టీకి ఓటు వేస్తాం’, అలాగే రేషన్ కార్డు, ఆధార్‌ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని కోరుతున్నారని అక్కడి సిబ్బంది వెల్లడించారు. దీనిపై హిసార్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ..‘ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న మాట వాస్తవమే. మేము హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన ఉద్దేశానికి విరుద్ధంగా ఫోన్లు చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ టోల్ ఫ్రీ నంబరు ప్రాముఖ్యాన్ని ప్రజలు అర్థం చేసుకొని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని ఆయన ప్రజలకు సూచించారు.  


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు