close

ఆంధ్రప్రదేశ్

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు: అమిత్‌ షా

కలింపాంగ్‌/రాయ్‌గంజ్‌: కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను ప్రవేశపెడతామని, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. అత్యంత వివాదాస్పదమైన ఈ విషయాలను గురువారం డార్జిలింగ్‌,రాయ్‌గంజ్‌ పరిధిలో నిర్వహించిన సభల్లో ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వైమానిక దాడులను మైనార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవటం కోసమే టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం అసోంకు మాత్రమే పరిమితం చేసిన జాతీయ పౌర పట్టికను ఆమె తీవ్రంగా వ్యతిరేకించటం ప్రజల్ని తప్పుదోవ పట్టించటమేనన్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు