close

ఆంధ్రప్రదేశ్

ఈవీఎంల మొరాయింపుపై ఆగ్రహం

ధర్నాకు దిగిన బుద్ధా వెంకన్న

విద్యాధరపురం, న్యూస్‌టుడే: విజయవాడ మల్లికార్జునపేటలోని సంపరతాతబ్బాయి కల్యాణ మండపంలోని 157వ పోలింగ్‌ బూత్‌ వద్ద శాసన మండలి విప్‌ బుద్ధా వెంకన్న గురువారం ధర్నా చేశారు. ఈ బూత్‌లో రెండు ఓట్లు పడిన వెంటనే వీవీ ప్యాట్‌ పనిచేయలేదు. రెండు గంటల తరువాత వీవీప్యాట్‌ మార్చారు. ఆ తర్వాత ఈవీఎం మొరాయించింది. 10 గంటల వరకూ ఈవీఎం పనిచేయకపోవడంతో వెంకన్న ఇతర ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. మల్లికార్జునపేటలోని జమ్మిదొడ్డి వద్ద ఒక ఈవీఎంలో ఏ గుర్తుకు ఓటు వేసినా భాజపాకు పడుతోందని తెదేపా కార్యకర్తలు ఆయనకు తెలియజేశారు. దాంతో ఎన్నికల సంఘం పనితీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. వైకాపా, భాజపా కుట్ర చేశాయని ఆరోపించారు.  సీఐ  అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఉదయం 11.30 గంటలకు ఈవీఎంకు మరమ్మతులు చేసి ఓట్లు వేయించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు