బ్రేకింగ్

breaking
23 Apr 2024 | 14:33 IST

పవన్‌ సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు

పిఠాపురం: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. అక్కడి నుంచి ఆర్వో కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తన ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్న ఆయన.. రూ.73.92 కోట్లు పన్నుగా చెల్లించినట్లు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని