icon icon icon
icon icon icon

నగరిలో మంత్రి రోజాకు ఎదురుదెబ్బ

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్‌కే రోజాకు ఎదురుదెబ్బ తగిలింది.

Published : 04 May 2024 05:47 IST

వైకాపాను వీడిన కీలక నేతలు

పుత్తూరు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్‌కే రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేతలు శ్రీశైలం దేవస్థానం మాజీ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, వడమాలపేట జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీపతిరాజు, ఆరుగురు సర్పంచులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు వైకాపాకు శుక్రవారం రాజీనామా చేశారు. మంత్రి రోజా.. తమకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని, పార్టీ అధికారంలోకి వచ్చాక తమను దూరం చేశారని వారు పలుమార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు టికెట్‌ ఇస్తే ఓడిపోతారని చెప్పారు. అధిష్ఠానం వీరి మాటను కాదని ఆమెకే టికెట్‌ ఇవ్వడంతో వారంతా రాజీనామా చేశారు. మరోవైపు ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో తాయిలాలు ఇచ్చి కొందరిని పార్టీ వీడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈలోపు మరికొందరు వెళ్లిపోవడంతో పార్టీలో కలకలం రేగింది. ఇప్పటికే మొదలియార్‌ వర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎంపీపీ ఏలుమలై రాజీనామా చేశారు. ఆయన పుత్తూరు, నగరిలో పర్యటించి మంత్రి అవినీతి, అక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ఆయన వెంట ఉన్న క్షత్రియ సామాజికవర్గ నాయకులు సైతం ఏకతాటిపైకి వచ్చి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img