బ్రేకింగ్

breaking
25 Apr 2024 | 23:14 IST

అదరగొట్టిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం

హైదరాబాద్‌: ఎట్టకేలకు బెంగళూరుకు రెండో విజయం. హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కోహ్లీ (51), రజత్‌ పటిదార్‌ (50) అర్ధశతకాలతో చెలరేగారు. గ్రీన్‌ (37), డుప్లెసిస్‌ (25) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉనద్కత్‌ 3, నటరాజన్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. షాబాజ్‌ అహ్మద్‌ (40*) టాప్‌ స్కోరర్‌. అభిషేక్‌ శర్మ (31), కమిన్స్‌ (31) చెలరేగారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌ 2, కర్ణ్‌ శర్మ 2, గ్రీన్‌ 2, జాక్స్‌ 1, దయాల్‌ 1 వికెట్ తీశారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని