icon icon icon
icon icon icon

Kangana Ranaut: కంగారులో కంగనా.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌ కాస్త గందరగోళానికి గురయ్యారు. తేజస్వీ యాదవ్‌పై విమర్శలు గుప్పించే ప్రయత్నంలో తమ పార్టీ నేత తేజస్వీ సూర్యపై ఆరోపణలు చేశారు.

Published : 06 May 2024 00:07 IST

దిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటి, భాజపా నేత కంగనా రనౌత్‌  (Kangana Ranaut) ఎన్నికల ప్రచారంలో కాస్త గందరగోళానికి గురయ్యారు. ప్రత్యర్థి పార్టీ నేతకు బదులుగా సొంత పార్టీ నేతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ నేతలిద్దరి పేర్లలోని మొదటి పదం ఒకటి కావడమే అందుకు కారణం. కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అసలేం జరిగిందంటే..

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా కంగనాను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. కాంగ్రెస్‌తో పాటు ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేశారు. ‘‘అవినీతిపరుల పార్టీ ఇక్కడ ఉంది. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలని కలలు కనే రాహుల్‌ గాంధీ, రౌడీయిజం చేసి.. చేపలు తినే తేజస్వీ సూర్య ఇందులో ఉన్నారు’’ అని అన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు బదులు భాజపా నేత తేజస్వీ సూర్యను ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు.

ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

కంగనాకు సంబంధించిన ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌.. ఈమె ఎవరు? అంటూ ఎద్దేవా చేశారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఆమెకు ఉన్న అర్హతలేంటని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఏడో విడతలో భాగంగా జూన్‌ 1న మండి నియోజకవర్గంలో పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img