PM Modi: ‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ

తమకు పిల్లలు లేరని, తమ తపనంతా భవిష్యత్తు తరాల చిన్నారుల కోసమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేరును ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Published : 05 May 2024 22:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీల్లో కుటుంబ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. వారి కుటుంబాల ప్రయోజనం కోసమే విపక్ష పార్టీలు పనిచేస్తుంటే.. తాము మాత్రం వచ్చే తరాల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నాని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ సొంత జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఎస్పీ, కాంగ్రెస్‌ కుటుంబ రాజకీయాలపై మండిపడ్డారు. తనతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రస్తావిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

‘మాకు పిల్లలు లేరు. మీ పిల్లల భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నాం. ఎందుకంటే.. మోదీ ఉన్నా.. లేకున్నా దేశం ఉంటుంది. అందుకే వచ్చే వెయ్యేళ్లు భారత్‌ శక్తిమంతంగా ఉండేలా పునాదులు వేస్తున్నాం. కానీ ఎస్పీ-కాంగ్రెస్‌లు ఏం చేస్తున్నాయి? వారు, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల ఉద్దేశాలూ మంచివి కావు. వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు, ఓటు బ్యాంకుకోసమే పని చేస్తాయి. వారి బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టినందువల్లే ప్రజాస్వామ్యం, రాజ్యంగం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

‘‘ఆ రెండు పార్టీల వారసత్వం ఏంటీ?.. కార్లు, బంగ్లాలు, రాజకీయాలను ప్రభావితం చేయడమే. కొందరు (ఎస్పీ) మెయిన్‌పురి, కన్నౌజ్‌, ఈటావా ప్రాంతాలను తమ రాజ్యంగా భావిస్తే.. మరికొందరు (కాంగ్రెస్‌) మాత్రం మేరఠ్‌, రాయ్‌ బరేలీలను తమ ఇలాకాగా భావిస్తారు. కానీ, మోదీ సృష్టించిన వారసత్వం మాత్రం ప్రతిఒక్కరి కోసం. 2047లో మీ కుమారుడు, కూతురు కూడా ప్రధాని లేదా ముఖ్యమంత్రి అవ్వొచ్చు. రాజకుటుంబాల వారసులు మాత్రమే ఈ పదవులను చేపడతారనే దుష్ట సంప్రదాయాన్ని ఈ ‘చాయ్‌వాలా’ తుంగలో తొక్కాడు’ అని ఆ రెండు పార్టీలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని